Saturday, June 22, 2013

I see you!

The gentle evening breeze,
that caressed my hair after a tiring day,
that soft plaintive number playing in my ears,
together we sung on many evenings,


The familiar sights and smells,
of the sweetmeats lined on the road,
those dancing silhouettes of little birds,
like the ones you made in the darkness of night,
 
The tiny drops of evening rain,
that washed my feet and tickled my face,
All carried with them, a familiarity.
that only my heart understood.
An intimacy, too incomprehensible,
and anguish, intolerable.

The anguish of your absence,
that almost choked my heart.
Yet, I live in the happiness of these little things,
for they are, also a memoir of our dearest past.
Will you come back soon and forever?
Before my life falls apart.

Sunday, June 16, 2013

For you, Nanna!

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ ఐతే,
మా అమ్మ పరిచయం చేసిన అతి గొప్ప వ్యక్తీ మా నాన్న!

తన భుజాలపై నన్ను మోసి,
తన గుండెలపై నన్ను నిడురబెట్టి
తన వేలితో ఈ లోకాన్నే పరిచయం చేసి,
వేలు పట్టి నడక నేర్పించిన
నా  తోలి గురువు నాన్న!

నా ఆట పాటల్లో వంతు పాడి,
నా చదువులో గురువు వై,
నా జీవితానికే ఊపిరి పోసిన
నా జీవిత కధానాయకుడు నాన్న!
నా ఆనందం  లో నే తన ఆనందాన్ని వెతుక్కుంటూ,
నా ఆశయాలనే తన ఆశయాలు గా మలుచుకుంటూ
నా లక్ష్య సాధన లో నే తన జీవితాన్ని సార్థకం చేసుకుని
నా గెలుపుల లోనే తన సంతోషాన్ని వెతుక్కున్న
నా నిలువెత్తు గర్వం మా నాన్న!

సముద్రం అంతటి ఆ గాంభీర్యం వెనక
వెన్నెలంత చల్లని ఒక చిరునవ్వు 
అగ్ని పర్వతం బద్దలయ్యే అంతటి కోపం లో ను
అంతులేని మమకారానికి చిహ్నమై
అవధుల్లేని ప్రేమను పంచి
నా జీవితానికే అండ గా నిలిచావు నువ్వు.

నేను విడిచే ప్రతి శ్వాస లో ను నువ్వే
నేను వేసే ప్రతి అడుగు లో ను నువ్వే
నువ్వే నా జీవితానికి వెలుగు,
ఇవే నీకు నా పాదాభివన్దనములు.